BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 26 May 2026, 04:31 pm
Posted by : V శ్రీనివాస్

అనారోగ్యంతో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
26 May, 2026 - 04:31 PM
140 వీక్షణలు

​మంచిర్యాల: అనారోగ్యంతో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య

​మంచిర్యాల, మే 26: తీవ్ర అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురై ఒక రిటైర్డ్ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

​పాత మంచిర్యాల ప్రాంతానికి చెందిన ఆడె భీమయ్య (68) సింగరేణి సంస్థలో పని చేసి పదవీ విరమణ పొందారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీని కోసం పలు ఆసుపత్రులలో చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం నయం కాకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు.

​ఈ క్రమంలోనే మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి భీమయ్య ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీఐ ప్రమోద్ రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రిటైర్డ్ ఉద్యోగి మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి