BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 31 August 2026, 08:08 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

మంచిర్యాల గోదావరి తీరంలో పుష్కరఘాట్ అభివృద్ధి పనులకు శ్రీకారం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
31 Aug, 2026 - 08:08 PM
48 వీక్షణలు

మంచిర్యాల: మంచిర్యాల గోదావరి తీరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పుష్కరఘాట్ అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

గోదావరి తీరాన్ని ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు స్థానిక ప్రజలు, భక్తులు, సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో పుష్కరఘాట్ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

పుష్కరఘాట్ అభివృద్ధి పూర్తయితే గోదావరి తీరానికి వచ్చే భక్తులు, పర్యాటకులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. గోదావరి తీర ప్రాంత అభివృద్ధితో మంచిర్యాల నగరానికి పర్యాటక పరంగా మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య–మహేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, సంబంధిత అధికారులు, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.