BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 12 June 2026, 09:24 pm
Posted by : V శ్రీనివాస్

​మంచిర్యాల జిల్లాను 100 శాతం అక్షరాస్యత సాధించేలా తీర్చిదిద్దాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
12 Jun, 2026 - 09:24 PM
162 వీక్షణలు

​విజయవంతంగా ముగిసిన అక్షర వాలంటీర్ల 100 రోజుల కుట్టు శిక్షణ

​ఉత్తీర్ణులకు త్వరలో సర్టిఫికెట్ల ప్రదానం

​అందరికీ విద్య – అందరిది బాధ్యత అని అధికారుల పిలుపు

​మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఐడీఓసీ సమావేశ మందిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో అక్షర వాలంటీర్లకు నిర్వహించిన 100 రోజుల కుట్టు శిక్షణ కార్యక్రమం శుక్రవారం (తేది. 12/06/2026) విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా శిక్షణను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న అక్షర వాలంటీర్లకు నిర్వాహకులు పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారందరికీ త్వరలోనే సర్టిఫికెట్లను అందజేయనున్నట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, కార్యదర్శి చందుర్తి మహేందర్, కోశాధికారి సత్యపాల్ రెడ్డి, డీఆర్పీలతో పాటు అక్షర వాలంటీర్లు విశేషంగా పాల్గొన్నారు.

​ఈ ముగింపు సమావేశంలో పాల్గొన్న నిజామాబాద్ వయోజన విద్య ఉపసంచాలకులు ఏ. పురుషోత్తం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చాతరాజుల దుర్గాప్రసాద్, లీడ్ బ్యాంకు మేనేజర్ తిరుపతి, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ అక్షర వాలంటీర్లకు పలు సూచనలు చేశారు. ప్రతి అక్షర వాలంటీరు 15 నుండి 60 సంవత్సరాల వయస్సు గల నిరక్షరాస్యులను గుర్తించి, వారికి చదవడం, రాయడంతో పాటు ప్రాథమిక గణిత నైపుణ్యాలను నేర్పించే బాధ్యతను స్వీకరించాలని సూచించారు. "అందరికీ విద్య – అందరిది బాధ్యత" అనే నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని, వాలంటీర్లందరూ అంకితభావంతో పనిచేసి మంచిర్యాల జిల్లాను 100 శాతం అక్షరాస్యత కలిగిన జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు