BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 01 May 2026, 09:22 am
Posted by : V శ్రీనివాస్

అంతర్జాతీయ స్థాయి ఫిష్ పాండ్ మరియు ఆలయాల అభివృద్ధికి భారీ నిధులు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
01 May, 2026 - 09:22 AM
162 వీక్షణలు

​​మంచిర్యాల ప్రగతి పథం: అంతర్జాతీయ స్థాయి ఫిష్ పాండ్ మరియు ఆలయాల అభివృద్ధికి భారీ నిధులు

మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని, ఇందులో భాగంగా దేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ స్థాయి ఫిష్ పాండ్ ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద 85.10 ఎకరాల్లో ఏర్పాటు కానుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు వెల్లడించారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఫిష్ పాండ్ ద్వారా 150 మంది మత్స్యకారులకు ఉపాధి లభించడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లల విత్తన సరఫరా జరుగుతుందని, దీనివల్ల మంచిర్యాలకు జాతీయ గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక రంగంలోనూ గూడెం సత్యనారాయణ స్వామి ఆలయానికి రూ. 70 కోట్లు, విశ్వనాథ ఆలయానికి రూ. 10 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇదే క్రమంలో బీజేపీ ధాన్యం కొనుగోళ్లపై రాజకీయం చేస్తోందని విమర్శిస్తూ, మాజీ ఎమ్మెల్యే మంచిర్యాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య తదితరులు పాల్గొన్నారు