BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 21 June 2026, 12:33 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోతనపల్లి గ్రామంలో గ్రామ దేవతలకు మొక్కుబడులు చెల్లించిన బంజారాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 12:33 PM
356 వీక్షణలు

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలో బంజారా సమాజం సభ్యులు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుబడులు చెల్లించారు. సంప్రదాయ ఆచారాల ప్రకారం గ్రామ శాంతి, సుభిక్షం కలగాలని కోరుతూ అమ్మవార్లకు పసుపు, కుంకుమ, పూలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వైసీపీ సీనియర్ నేత దేశరెడ్డి రాఘవరెడ్డి, మాజీ సర్పంచ్ కారంగుల శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామ దేవతల పూజలు గ్రామ ఐక్యతకు, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అందరూ కలిసి ముందుకు సాగాలని సూచించారు.

పూజల అనంతరం గ్రామ పెద్దలు, భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.