BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 26 May 2026, 04:36 pm
Posted by : V శ్రీనివాస్

మంచిర్యాలలో అకాల వర్షం: ప్రజలకు ఉపశమనం.. రైతులకు ఆందోళన

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
26 May, 2026 - 04:36 PM
128 వీక్షణలు

మంచిర్యాలలో అకాల వర్షం: ప్రజలకు ఉపశమనం.. రైతులకు ఆందోళన

మంచిర్యాల, మే 26: మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు జిల్లాలోని పలుచోట్ల కురిసిన తేలికపాటి జల్లులు కాస్త ఉపశమనాన్ని ఇచ్చాయి. అయితే, ఈ అకాల వర్షం అన్నదాతల్లో తీవ్ర ఆందోళన నింపింది. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాల (ఐకేపీ సెంటర్ల) వద్ద తమ పంటను విక్రయించడానికి వేచి ఉన్న రైతులు, ఈ అకస్మాత్తు వర్షం వల్ల ధాన్యం తడిసి ముద్దవుతుందేమోనని, తద్వారా భారీగా నష్టపోతామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వాతావరణం చల్లబడి జనం ఊపిరి పీల్చుకుంటుంటే, మరోవైపు కొనుగోళ్లు ఆలస్యం కావడం వల్లే తమకు ఈ తిప్పలు తప్పడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు