BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 13 June 2026, 06:57 pm
Posted by : V శ్రీనివాస్

మంచిర్యాలలో మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే.. కాంగ్రెస్ పాలనలో పెరిగిన రౌడీయిజం: మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
13 Jun, 2026 - 06:57 PM
184 వీక్షణలు

​మంచిర్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు మరియు SIR ఓటర్ నమోదు ప్రక్రియపై మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారి అధ్యక్షతన అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, జిల్లా ఇంచార్జ్ నారదాసు లక్ష్మణ్, నియోజకవర్గ ఇంచార్జ్ కౌశిక హరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ.. మంచిర్యాలలో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యుత్సాహంతో, అధికార బలంతో బీఆర్ఎస్ సానుభూతిపరుల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని, దానిని పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు గులాబీ జెండా అంటేనే భయం పట్టుకుందని, అందుకే మున్సిపల్, పోలీసు అధికారులతో ఫ్లెక్సీలు, జెండాలు తొలగించారని విమర్శించారు. నియోజకవర్గంలో కొత్తగా పుట్టుకొచ్చిన గుండాయిజం, రౌడీయిజంపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అక్రమ కేసులను ఎదురొడ్డి పోరాడాలని కార్యకర్తలకు సూచించారు.

​నియోజకవర్గ అభివృద్ధిని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటూ స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారని దివాకర్ రావు ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలకు గుండెకాయ లాంటి మంచిర్యాల - అంతర్గాం బ్రిడ్జిని రద్దు చేయడం ఆయనకు ప్రజల మీద ఉన్న కోపానికి నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ హయాంలో రంగపేట బ్రిడ్జికి మంజూరైన రూ. 13.50 కోట్ల నిధులను పక్కదారి పట్టించి, రాజకీయ కక్షతో లక్ష్మీ టాకీస్ నుండి పాత మంచిర్యాల, ఆండాలమ్మ నగర్ మీదుగా రోడ్డు వెడల్పుకు కేటాయించారని మండిపడ్డారు. వందల వాహనాలు తిరిగే ఐబి చౌరస్తా - శ్రీనివాస గార్డెన్ జాతీయ రహదారిని నాలుగు వరుసలకే పరిమితం చేసిన ఎమ్మెల్యే.. రాళ్లవాగు వద్ద తాను కొనుగోలు చేసిన 24 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న సొంత ఇంటికి వెళ్లి రావడానికే స్వార్థంతో రాళ్లవాగు - రంగపేట ఆరు వరుసల రోడ్డును నిర్మిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

​రైతుల పక్షాన నిలబడాల్సిన ఎమ్మెల్యే రైస్ మిల్లర్లతో కుమ్మక్కై 'తరుగు' పేరిట రైతుల కష్టాన్ని నిలువునా దోచుకుంటున్నారని దివాకర్ రావు విమర్శించారు. గతంలో ధాన్యం కొనుగోళ్లపై సీబీసీఐడీ (CBCID) ఎంక్వయిరీ వేయిస్తానని ప్రగల్భాలు పలికిన ఆయన, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ప్రశ్నించారు. 2014 నుండి నేటి వరకు జరిగిన ధాన్యం కొనుగోళ్లపై తక్షణమే సీబీసీఐడీ విచారణ జరిపించాలని, లేనిపక్షంలో రైతులను, ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేలా అంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరిన ఈ కార్యక్రమంలో.. స్థానిక ప్రజా ప్రతినిధులు, మాజీ నాయకులు, టీబీజీకేఎస్ (TBGKS) నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు మరియు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు