BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 16 March 2026, 10:06 am
Posted by : V శ్రీనివాస్

మంచిర్యాలలో ముమ్మరంగా పారిశుధ్య పనులు: పర్యవేక్షించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
16 Mar, 2026 - 10:06 AM
152 వీక్షణలు

మంచిర్యాలలో ముమ్మరంగా పారిశుధ్య పనులు: పర్యవేక్షించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల, మార్చి 16: పట్టణ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ప్రభుత్వ 99 రోజుల ప్రణాళికలో భాగంగా మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని 37, 55, 14వ డివిజన్లలో సోమవారం ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. అనంతరం మున్సిపల్ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి అన్ని విధాలా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.

నగరాన్ని శుభ్రంగా ఉంచుదాం:

ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలిగి నగరాన్ని శుభ్రంగా ఉంచాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్, మున్సిపల్ కమిషనర్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొని పారిశుధ్య నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు