BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 27 August 2026, 07:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మంగళగిరిలో ఆధునిక మోడల్ రైతు బజార్‌కు శ్రీకారం....

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 07:28 PM
64 వీక్షణలు

మంగళగిరిలో ఆధునిక మోడల్ రైతు బజార్‌కు శ్రీకారం.. రూ.18 కోట్లతో నిర్మాణం

మంగళగిరి: ప్రజలు, రైతుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలతో కూడిన మోడల్ రైతు బజార్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. నిడమర్రు రైల్వే గేట్ సమీపంలో ఈ ప్రతిష్టాత్మక మార్కెట్‌ను ఏర్పాటు చేయనున్నారు.

అరబిందో ఫార్మా ట్రస్ట్ సామాజిక బాధ్యత నిధులు రూ.18 కోట్లతో 5.90 ఎకరాల విస్తీర్ణంలో రైతు బజార్ నిర్మాణం చేపట్టనున్నారు. రైతులు పండించిన కూరగాయలు, పండ్లు, పూలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు అనువైన వేదికగా దీనిని తీర్చిదిద్దనున్నారు.

మార్కెట్‌లో ప్రత్యేక దుకాణాలు, కోల్డ్ స్టోరేజీ సదుపాయం, వాహనాల పార్కింగ్, వినియోగదారులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించనున్నారు. రైతులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంతో పాటు, ప్రజలకు నాణ్యమైన తాజా ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ మోడల్ రైతు బజార్‌ను అభివృద్ధి చేయనున్నారు.