BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 31 August 2026, 08:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక..

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 08:12 PM
49 వీక్షణలు

మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక.. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

మంగళగిరి, ఆగస్టు 31:

టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను మంత్రికి అందజేశారు. ఆయా సమస్యలను పరిశీలించిన మంత్రి, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేస్తామని తెలిపారు.

ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులకు పంపించి, వీలైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రజలకు ప్రభుత్వం, పార్టీ నాయకత్వానికి మధ్య వారధిగా ప్రజా పరిష్కార వేదికలు పనిచేస్తున్నాయని, సామాన్యుల సమస్యలు నేరుగా ఉన్నత స్థాయికి చేరేందుకు ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు.