BREAKING
గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం
Date of Publish : 22 April 2026, 06:13 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
22 Apr, 2026 - 06:13 PM
123 వీక్షణలు

మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము

ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల హెచ్చరిక

కొప్పుల ఈశ్వర్ ఖబడ్డార్.. దళిత వ్యతిరేక వైఖరి వీడకుంటే తగిన శాస్తి తప్పదు

​మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ జోలికొస్తే సహించం

మాదిగ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో డిమాండ్.

​రాష్ట్ర మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ పట్ల మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఎమ్మార్పీఎస్ మరియు వివిధ దళిత సంఘాలు తీవ్రంగా ఖండించాయి. బుధవారం జగిత్యాల పట్టణ కేంద్రంలోని మాదిగ సంఘ భవనంలో ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కొప్పుల ఈశ్వర్ వైఖరిపై నిప్పులు చెరిగారు.

​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి ఆడ్లూరి పై నోరు పారేసుకోవడం సరికాదని, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి దళిత నాయకులపై బురద చల్లడం మానుకోవాలని హెచ్చరించారు. "కొప్పుల ఈశ్వర్ ఖబడ్డార్.. నీ అహంకారపూరిత వ్యాఖ్యలను మేము గమనిస్తున్నాం. దళిత నాయకుడి ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారా?" అని వారు ప్రశ్నించారు.

అనవసర విమర్శలు చేస్తూ ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, రాబోయే రోజుల్లో కొప్పుల ఈశ్వర్‌కు దళిత సమాజం తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. 

మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రాంత అభివృద్ధి కోసం, దళితుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఆయనకు దళిత సంఘాలన్నీ అండగా ఉంటాయని వారు స్పష్టం చేశారు.

తక్షణమే కొప్పుల ఈశ్వర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో దుమాల గంగారాం మాదిగ ఎంఎస్పి mrps జిల్లా అధ్యక్షులు

చిలుముల లక్ష్మణ్ మాదిగ నాగారం సర్పంచ్ మరియు.మార్కెట్ కమిటీ చైర్మన్ 

ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ బాలే శంకర్ మాదిగ దుమాల రాజ్ కుమార్ మాదిగ జగిత్యాల పట్టణ 16వ కౌన్సిలర్ బోనగిరి కిషన్ మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు నక్క సతీష్ మాదిగ  బడుగు.రాజేంద్ర మాదిగ కౌన్సిలర్ బొల్లారం గిరిధర్ మాదిగ 14వ వార్డు కౌన్సిలర్. దుమాల తిరుపతి మాదిగ చర్లపల్లి మాజీ సర్పంచ్ దాసరి సతీష్ ఎమ్మార్పీఎస్ జగిత్యాల మండలం అధ్యక్షులు. దుమాల భూమయ్య మారంపల్లి శంకర్ మాదిగ పట్టణ ఎం ఎస్ పి అధ్యక్షులు మోకిన పెళ్లి తిరుపతి లక్ష్మణ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు