BREAKING
గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం
Date of Publish : 22 July 2026, 06:43 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నీట్ వివాదంతో పార్లమెంట్ స్తంభనం.. ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళన

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 06:43 AM
63 వీక్షణలు

నీట్ వివాదంతో పార్లమెంట్ స్తంభనం.. ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళన

న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నాపత్రం లీక్, విద్యార్థులు–యువతపై పోలీసుల లాఠీచార్జీ అంశాలపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో బుధవారం పార్లమెంట్ ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడి స్తంభించాయి.

లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయానికే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను పలుమార్లు వాయిదా వేశారు. అనంతరం కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సభను బుధవారానికి వాయిదా వేశారు.

రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విద్యార్థులపై లాఠీచార్జీ, నీట్ పరీక్షలో అవకతవకలపై చర్చ కోరగా, సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో చైర్మన్, అనంతరం డిప్యూటీ చైర్మన్ సభను పలుమార్లు వాయిదా వేసి చివరకు బుధవారానికి వాయిదా వేశారు.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎంపీలు కలిసి విద్యార్థుల సమస్యలపై చర్చకు అవకాశం కల్పించాలని కోరారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, విద్యార్థులపై పోలీసుల అణచివేతపై ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. విద్యార్థులపై జరిగిన ఘటన, విద్యావ్యవస్థలోని వైఫల్యాలపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై బలప్రయోగం భారతీయ సంస్కృతికి విరుద్ధమని, ఈ అంశాన్ని ప్రతిపక్షం పార్లమెంట్‌లోనూ, ప్రజల్లోనూ నిరంతరం లేవనెత్తుతుందని చెప్పారు.

ఇక పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సుప్రియా సూలే, జాన్ బ్రిట్టాస్, ధర్మేంద్ర యాదవ్, సంజయ్ రౌత్ తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. అనంతరం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారని తెలిపారు.