BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

మంత్రి కొండ సురేఖ ఇంటి ముట్టడి.. హనుమకొండలో మున్సిపల్ కార్మికుల ఆందోళన ఉద్రిక్తం

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 12:01 PM
61 వీక్షణలు

హనుమకొండ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు భారీ నిరసన చేపట్టారు. అంబేద్కర్ సెంటర్ నుంచి రాంనగర్‌లోని మంత్రి కొండ సురేఖ నివాసం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన కార్మికులు, మంత్రి ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు.

మంత్రి నివాసం వద్ద పోలీసులు భారీగా బారికేడ్లు, కేట్లు ఏర్పాటు చేసినప్పటికీ ఆగ్రహంతో ఉన్న కార్మికులు వాటిని తోసుకుంటూ ముందుకు దూసుకెళ్లారు. అనంతరం మంత్రి ఇంటి గేటు ముందు బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు.

కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. కార్మికుల ఆందోళనతో మంత్రి నివాసం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.