BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 01 July 2026, 12:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మిర్యాలగూడలో పోలీసుల మెగా నాకాబందీ.. 150 వాహనాలపై కేసులు, 40 మంది డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టివేత

తెలంగాణ
/ నల్గొండ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 12:53 PM
123 వీక్షణలు

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసులు నిర్వహించిన మెగా నాకాబందీలో విస్తృత తనిఖీలు చేపట్టారు. రాత్రంతా కొనసాగిన ఈ తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 150 వాహనాలపై కేసులు నమోదు చేయగా, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 40 మందిని పోలీసులు పట్టుకున్నారు.

ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడం, నంబర్ ప్లేట్ లేని వాహనాలు, మోడిఫైడ్ సైలెన్సర్లతో తిరుగుతున్న వాహనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

అసాంఘిక కార్యకలాపాలు, బైక్ రేసింగ్‌లు, అర్ధరాత్రి హల్‌చల్ సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. గంజాయి, మట్కా, జూదం, అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

నిర్ణీత సమయం దాటిన తర్వాత దాబాలు, కేఫ్‌లు, టీ స్టాళ్లు, రెస్టారెంట్లు నిర్వహిస్తున్న యజమానులపైనా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.