BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 01 July 2026, 12:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణలో ఇసుక లోడింగ్ బంద్.. 35 క్వారీల్లో కార్యకలాపాలు నిలిపివేత

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 12:53 PM
181 వీక్షణలు

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా 35 ఇసుక క్వారీల్లో బుధవారం నుంచి లోడింగ్ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు కాంట్రాక్టర్లు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని 18 ఇసుక క్వారీల్లో కూడా లోడింగ్ పూర్తిగా నిలిచిపోనుంది.

డీజిల్ ధరలు భారీగా పెరగడంతో నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయని, ప్రస్తుత పరిస్థితుల్లో క్వారీల నిర్వహణ ఆర్థికంగా భారంగా మారిందని కాంట్రాక్టర్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో తమకు చెల్లించాల్సిన సుమారు రూ.300 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వం తమ సమస్యలపై వెంటనే స్పందించి బకాయిల చెల్లింపుతో పాటు ఇసుక క్వారీల నిర్వహణకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించారు. ఇసుక లోడింగ్ బంద్ కారణంగా నిర్మాణ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.