BREAKING
thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు
Date of Publish : 01 July 2026, 02:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన కీలక మార్పులు.. ఆధార్, పాస్‌పోర్ట్, రైల్వే ప్రయాణికులకు కొత్త నిబంధనలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 02:58 PM
134 వీక్షణలు

🔹 ఆధార్ సేవలు ఉచితం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఆధార్‌కు ఈ-మెయిల్ లింక్ చేయడం లేదా అప్‌డేట్ చేసుకునే సేవలను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. గతంలో ఈ సేవకు రూ.75 ఫీజు ఉండగా, జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఎలాంటి చార్జీలు లేకుండా ఈ సేవను వినియోగించుకోవచ్చు.

🔹 పాస్‌పోర్ట్ ఫీజుల పెంపు జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ ఫీజులను పెంచింది. 14 ఏళ్ల తర్వాత ఫీజుల్లో సవరణలు చేపట్టింది. కొత్త ధరల ప్రకారం..

36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ ఫీజు రూ.1,500 నుంచి రూ.2,500కు పెరిగింది.

తక్షణ పాస్‌పోర్ట్ ఫీజు రూ.3,500 నుంచి రూ.5,000కు పెరిగింది.

ఇతర పాస్‌పోర్ట్ సేవల ఫీజుల్లోనూ మార్పులు అమల్లోకి వచ్చాయి.

🔹 రైళ్లలో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే భారీ జరిమానా భారతీయ రైల్వే శాఖ టిక్కెట్ లేకుండా ప్రయాణించే వారిపై జరిమానాను రెట్టింపు చేసింది. ఇంతకుముందు రూ.250గా ఉన్న ఫీజు, జూలై 1 నుంచి రూ.500కు పెరిగింది.

జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ మార్పులు ఆధార్ సేవలు, పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు, రైల్వే ప్రయాణికులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి.