BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 01 July 2026, 02:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల జీవోపై ధస్తావేజు లేఖరుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 02:58 PM
109 వీక్షణలు

రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు సంబంధించి జీవో ఎంఎస్ నంబర్-396ను విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ధస్తావేజు లేఖరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల వ్యవస్థను క్రమంగా ప్రైవేటుపరం చేసే దిశగా అడుగులు వేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

ఈ జీవో అమలుతో వేలాది మంది ధస్తావేజు లేఖరుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని, అనేక కుటుంబాలు ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని జీవోపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలు, నియోజకవర్గాల్లో ధస్తావేజు లేఖరులు నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. తమ ఆక్రందనను ప్రభుత్వం సహృదయంతో పరిశీలించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్-396ను ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, ప్రతి నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ధస్తావేజు లేఖరుల రాష్ట్ర సంఘం నేతలు హెచ్చరించారు.