BREAKING
thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు
Date of Publish : 01 July 2026, 12:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నేటి నుంచి దేశవ్యాప్తంగా VB-G RAM G చట్టం అమలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 12:02 PM
150 వీక్షణలు

న్యూఢిల్లీ: గ్రామీణ ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన VB-G RAM G చట్టం నేటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు.

ఈ చట్టం కింద గ్రామీణ కుటుంబాలకు ఏడాదికి 125 రోజుల ఉపాధి హామీ కల్పించనున్నారు. ఉపాధితో పాటు గ్రామీణ కుటుంబాల ఆదాయం పెంపు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

రేపు తిరుపతిలో VB-G RAM G కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ చట్టాన్ని అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అంశంపై తెలంగాణ కేబినెట్ కూడా రేపు నిర్ణయం తీసుకోనుంది.

ఈ పథకానికి సంబంధించిన నిధుల్లో కేంద్రం-రాష్ట్రాల వాటా నిష్పత్తిని 60:40గా నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు అభివృద్ధి పనులకు ఈ చట్టం ఊతమివ్వనుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.