BREAKING
thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV
Date of Publish : 01 July 2026, 12:54 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరసింహరావుకు ఘనంగా పదవీ విరమణ సన్మానం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
01 Jul, 2026 - 12:54 PM
100 వీక్షణలు

నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణతో  ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరవేయడంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు సేవలు అందించారని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి  నరసింహరావు  పదవీ విరమణ సందర్భంగా ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  భాస్కర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ సేవలో నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణతో పనిచేసిన అధికారులు సమాజానికి ఆదర్శప్రాయులని అన్నారు. జిల్లా సంక్షేమ అధికారి నరసింహరావు తన సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో సంక్షేమ శాఖ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు విశేష సేవలు అందించారని కొనియాడారు. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండి పనిచేశారని పేర్కొన్నారు.పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి ముగింపు మాత్రమేనని, జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది అని అదనపు కలెక్టర్ అన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో జిల్లా సంక్షేమ అధికారి ఎంతో కృషి చేశారని, అనేక సంఘటనలలో కలిసిమెలిసి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేయడం జరిగిందన్నారు. ముందు ముందు జీవితంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరసింహరావు మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో సహకరించిన జిల్లా యంత్రాంగానికి, ఉన్నతాధికారులకు, సహోద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అందించిన అభిమానాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని అన్నారు.అనంతరం జిల్లా అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు,ఉద్యోగులు, సంక్షేమ శాఖ సిబ్బంది,కుటుంబ సభ్యులు,పాల్గొని నరసింహరావు కి శుభాకాంక్షలు తెలియజేసి,వారి సేవలను అభినందించి శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ సీఈవో శ్రీనివాస్,పరిపాలన అధికారి అంజిరెడ్డి ,వరంగల్ రీజియన్ జాయింట్ అధికారి కృష్ణవేణి,ట్రేసా జిల్లా అధ్యక్షులు కృష్ణ , జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి శ్యామ్ సుందర్, డీఎంఎచ్ ఓ మనోహర్,ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతీ,డీఆర్ఓ జయమ్మ, సిడిపిఓ వెంకటరమణ,స్వరాజ్యం, శైలజనాజీ, యమినీ,వేణుగోపాల రావు యశోద,సోమేష్,శశికళ, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది, సఖి, ఐసిపిఎస్  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు