BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 15 May 2026, 11:07 pm
Posted by : యామనూరి మల్లికార్జున

మనమిత్ర వాట్సాప్ ద్వారా భక్తులకు మరిన్ని సేవలు

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
15 May, 2026 - 11:07 PM
156 వీక్షణలు

మనమిత్ర వాట్సాప్ ద్వారా భక్తులకు మరిన్ని సేవలు - కార్యనిర్వాహనాధికారి  శ్రీనివాసరావు 

కార్యనిర్వహణాధికారివారి కార్యాలయం

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 

మనమిత్ర వాట్సప్ ద్వారా దర్శనం మరియు ఆర్జితసేవా టికెట్లు

•  మనమిత్ర వాట్సప్ నందు అందుబాటులో శ్రీస్వామివారి స్పర్శదర్శనం టికెట్లు

•  దర్శనాలతో పాటు మొత్తం 18 రకాల సేవాటిక్కెట్లను మనమిత్ర ద్వారా పొందే అవకాశం

•  విరాళాలు కూడా మనమిత్ర ద్వారా చెల్లించే సౌకర్యం

•  మనమిత్ర ద్వారా పరోక్షసేవా టికెట్లు కూడా పొందే సదుపాయం

కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు

శ్రీస్వామివారి స్పర్శదర్శనం టికెట్లు కూడా మనమిత్ర వాట్సప్ ద్వారా పొందే అవకాశం కల్పించామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు పేర్కొన్నారు. 

దర్శనాలతో పాటు మొత్తం 18 రకాల సేవాటికెట్లను మనమిత్ర వాట్సప్ ద్వారా పొందేఅవకాశం ఉందన్నారు. అదేవిధంగా విరాళాలు కూడా ఈ మనమిత్ర వాట్సప్ ద్వారా చెల్లించే వీలు  కల్పించబడిందన్నారు. 

భక్తులకు మనమిత్రపై అవగాహన కల్పించేందుకు క్షేత్రపరిధిలో విస్తృతంగా మనమిత్ర బోర్డులను ఏర్పాటు చేయబడటం జరిగిందన్నారు. 

అదేవిధంగా క్యూ కాంప్లెక్సు ఎదురుగా మనమిత్ర సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు.  ఇంకా సి.ఆర్.ఓ కార్యాలయం, గణేశసదన్ మొదలైనచోట్ల కూడా మనమిత్ర సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. 

అలాగే పరోక్షసేవాటికెట్లను కూడా మనమిత్ర ద్వారా పొందవచ్చునని,  శ్రీశైలానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో ఆయా సేవలను పరోక్షంగా జరిపించుకునే వీలుగా దేవస్థానం ఈ పరోక్షసేవలను నిర్వహించడం జరుగుతోందన్నారు.   

ఇంకా వారు మాట్లాడుతూ ఆయా పౌరసేవలను సమర్థవంతంగా,  వేగంగా, పారదర్శకంగా అందించేందుకు వీలుగా వచ్చిన ఈ వాట్సాప్ గవర్నెన్స్ విధానంలో పౌరులు పలు  శాఖలకు సంబంధించిన ఆయా సేవలను పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు.   

ఆయా సేవలను సులభతరంగా అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్‌ నెంబరును *9552300009* అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. 

కాగా ఈ మనమిత్ర వాట్సాప్ ద్వారా దేవదాయశాఖ పరిధిలోని పలు ఆలయాల దర్శనం టికెట్లు,  ఆర్జితసేవాటికెట్లు, ప్రసాదాల టికెట్లు మరియు విరాళాలను చెల్లించే విధానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. 

ఈ వాట్సాప్ ద్వారా శ్రీశైలదేవస్థానం నందలి శ్రీస్వామివారి స్పర్శదర్శనం, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం టికెట్లను పొందవచ్చునని తెలియజేశారు. అదేవిధంగా శ్రీస్వామివారి ఆర్జిత గర్భాలయఅభిషేకం, ఆర్జితసామూహిక అభిషేకం, కుంకుమార్చన, గణపతిహోమం, రుద్రహోమం, మహామృత్యుంజయహోమం, చండీహోమం, కల్యాణోత్సవం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం మొదలైన   18 ఆర్జితసేవలకు సంబంధించిన సేవా టికెట్లను కూడా పొందవచ్చునని పేర్కొన్నారు. 

భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యనిర్వహణాధికారి కోరారు.  

 పత్రికా ప్రకటన  

కార్యనిర్వహణాధికారివారి కార్యాలయం

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 

  తేది:  15.05.2026

*మనమిత్ర వాట్సప్ ద్వారా దర్శనం మరియు ఆర్జితసేవా టికెట్లు* 

• *మనమిత్ర వాట్సప్ నందు అందుబాటులో శ్రీస్వామివారి స్పర్శదర్శనం టికెట్లు*

• *దర్శనాలతో పాటు మొత్తం 18 రకాల సేవాటిక్కెట్లను మనమిత్ర ద్వారా పొందే అవకాశం*

• *విరాళాలు కూడా మనమిత్ర ద్వారా చెల్లించే సౌకర్యం*

• *మనమిత్ర ద్వారా పరోక్షసేవా టికెట్లు కూడా పొందే సదుపాయం*

*కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు*

శ్రీస్వామివారి స్పర్శదర్శనం టికెట్లు కూడా మనమిత్ర వాట్సప్ ద్వారా పొందే అవకాశం కల్పించామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు పేర్కొన్నారు. 

దర్శనాలతో పాటు మొత్తం 18 రకాల సేవాటికెట్లను మనమిత్ర వాట్సప్ ద్వారా పొందేఅవకాశం ఉందన్నారు. అదేవిధంగా విరాళాలు కూడా ఈ మనమిత్ర వాట్సప్ ద్వారా చెల్లించే వీలు  కల్పించబడిందన్నారు. 

భక్తులకు మనమిత్రపై అవగాహన కల్పించేందుకు క్షేత్రపరిధిలో విస్తృతంగా మనమిత్ర బోర్డులను ఏర్పాటు చేయబడటం జరిగిందన్నారు. 

అదేవిధంగా క్యూ కాంప్లెక్సు ఎదురుగా మనమిత్ర సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు.  ఇంకా సి.ఆర్.ఓ కార్యాలయం, గణేశసదన్ మొదలైనచోట్ల కూడా మనమిత్ర సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. 

అలాగే పరోక్షసేవాటికెట్లను కూడా మనమిత్ర ద్వారా పొందవచ్చునని,  శ్రీశైలానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో ఆయా సేవలను పరోక్షంగా జరిపించుకునే వీలుగా దేవస్థానం ఈ పరోక్షసేవలను నిర్వహించడం జరుగుతోందన్నారు.   

ఇంకా వారు మాట్లాడుతూ ఆయా పౌరసేవలను సమర్థవంతంగా,  వేగంగా, పారదర్శకంగా అందించేందుకు వీలుగా వచ్చిన ఈ వాట్సాప్ గవర్నెన్స్ విధానంలో పౌరులు పలు  శాఖలకు సంబంధించిన ఆయా సేవలను పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు.   

ఆయా సేవలను సులభతరంగా అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్‌ నెంబరును *9552300009* అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. 

కాగా ఈ మనమిత్ర వాట్సాప్ ద్వారా దేవదాయశాఖ పరిధిలోని పలు ఆలయాల దర్శనం టికెట్లు,  ఆర్జితసేవాటికెట్లు, ప్రసాదాల టికెట్లు మరియు విరాళాలను చెల్లించే విధానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. 

ఈ వాట్సాప్ ద్వారా శ్రీశైలదేవస్థానం నందలి శ్రీస్వామివారి స్పర్శదర్శనం, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం టికెట్లను పొందవచ్చునని తెలియజేశారు. అదేవిధంగా శ్రీస్వామివారి ఆర్జిత గర్భాలయఅభిషేకం, ఆర్జితసామూహిక అభిషేకం, కుంకుమార్చన, గణపతిహోమం, రుద్రహోమం, మహామృత్యుంజయహోమం, చండీహోమం, కల్యాణోత్సవం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం మొదలైన   18 ఆర్జితసేవలకు సంబంధించిన సేవా టికెట్లను కూడా పొందవచ్చునని పేర్కొన్నారు. 

భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యనిర్వహణాధికారి కోరారు.  

( కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు)

శ్రీశైలదేవస్థానం వారి ద్వారా జారీ

( కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు)

శ్రీశైలదేవస్థానం వారి ద్వారా జారీ