BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 28 April 2026, 07:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మర్లపాలెంలో మహిళల రక్షణ–ప్రజల భద్రతే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Apr, 2026 - 07:15 PM
144 వీక్షణలు

మర్లపాలెంలో మహిళల రక్షణ–ప్రజల భద్రతే లక్ష్యం: పోలీస్ అవగాహన సదస్సు నిర్వహించిన ఏఎస్ఐ గఫార్ 

ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం మహిళల రక్షణ, నేర నియంత్రణ మరియు ప్రజల భద్రతే ప్రధాన ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తోంది. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలు, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ మార్గదర్శకత్వంలో నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం మర్లపాలెం గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సబ్ ఇన్స్పెక్టర్ డి రామకృష్ణ ఆధ్వర్యంలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గఫార్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏఎస్ఐ గఫార్ మాట్లాడుతూ మహిళా సంరక్షణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శక్తి టీమ్స్ ప్రాధాన్యతను వివరించారు. మహిళలు, విద్యార్థినులు తమ హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి వేధింపులు ఎదురైనా భయం వీడి వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటిపి, బ్యాంక్ వివరాలు ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని తెలిపారు. వేసవి కాలంలో గ్రామాలకు వెళ్లే సమయంలో ఇళ్లకు పటిష్టమైన తాళాలు వేసి, విలువైన వస్తువుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని, గ్రామాలు మరియు వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను నివారించవచ్చని చెప్పారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజల సహకారం ద్వారానే నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని పోలీస్ అధికారులు కోరారు.