BREAKING
thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 12 November 2026, 06:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

స్టేషన్ ఘనపూర్ జాతీయ రహదారిపై డస్టర్ కారులో భారీ అగ్నిప్రమాదం..

తెలంగాణ
/ జనగామ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 06:02 PM
4 వీక్షణలు

తృటిలో తప్పిన ప్రాణాపాయం

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ జాతీయ రహదారిపై భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డీజిల్ లీకేజీ కారణంగా డస్టర్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయం నుంచి తృటిలో బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు వ్యక్తులు డస్టర్ కారులో హనుమకొండ నుంచి మల్లన్నగండికి వెళ్తుండగా స్టేషన్ ఘనపూర్ జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. ఈ క్రమంలో కారు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే అప్రమత్తమై కారును రహదారి పక్కన నిలిపివేసి, అందులో ఉన్న ఇద్దరూ వెంటనే కిందకు దిగారు. కొద్దిసేపటికే డీజిల్ లీకేజీ కారణంగా కారులో మంటలు చెలరేగి చూస్తుండగానే వాహనం మొత్తం వ్యాపించాయి. దీంతో కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఇద్దరూ సురక్షితంగా బయటపడగా పెను ప్రమాదం తప్పింది. కళ్ల ముందే కారు మంటల్లో కాలిపోవడంతో స్థానికులు, వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో స్టేషన్ ఘనపూర్ జాతీయ రహదారిపై కొద్దిసేపు కలకలం నెలకొంది.