www.ntodaynews.com
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం సహకారంతో గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేశారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేద కుటుంబాలకు ఈ నిధులు మంజూరయ్యాయి. ఓర్సు సునీత , సాగర్ల యాదయ్య, గుంటూజి శైలజ , శిరస్సు సుజాత , గుండెపురి శీను ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యులు యాదయ్య, నీలకంఠం లింగస్వామి, సాగర్ల నాగరాజు, ఆనగంటి నరేష్, ఏర్పుల నరసింహ, గుండెపురి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.