BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 20 August 2026, 07:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మున్సిపల్ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఐటీయూ ధర్నా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Aug, 2026 - 07:29 PM
70 వీక్షణలు

జీవోలు 975, 673 రద్దు చేయాలని డిమాండ్.. 48 వేల మంది కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పు: సీఐటీయూ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలో మున్సిపల్ రంగంలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని 14 రకాల పౌర సేవలను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ అమలైతే ప్రజలపై యూజర్ చార్జీలు, డెవలప్‌మెంట్ చార్జీల రూపంలో అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

జీవో నెంబర్ 975, జీవో నెంబర్ 673లను తక్షణమే రద్దు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 48 వేల మంది మున్సిపల్ కార్మికుల ఉద్యోగ భద్రతను కాపాడాలని కోరారు. మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

అదనపు కార్మికులకు పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

ధర్నాలో సీఐటీయూ నేతలు ఎస్వీ భద్రం, ఏ రవి తదితర యూనియన్ నాయకులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మున్సిపల్ కార్మికులు హాజరై ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.