BREAKING
కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ
www.ntodaynews.com

క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషం నింపాలి

తెలంగాణ
19 Dec, 2025 - 06:54 PM
73 వీక్షణలు

క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషం నింపాలి

NTODAY NEWS: ఏలూరు జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్. క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరు కుటుంబంలో ఆనందం సంతోషం నింపాలని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున స్థానిక ఆర్ఆర్ పేట శానిటేషన్ సర్కిల్ కార్యాలయం వద్ద శానిటేషన్ అధికారులు,సిబ్బంది ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య తిధులుగా ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్-ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ మాట్లాడుతూ ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరూ ప్రేమ కరుణా స్నేహభావంతో ఆనందంగా జరుపుకోవాలని అన్నారు.అందరితో కలిసి చక్కటి వాతావరణంలో జరుగుతున్న సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రభువు గురించి పాస్టర్ చెబుతున్న ప్రతి ఒక్క వాక్యాన్ని అందరూ తెలుసుకుని ఆచరించాలని మేయర్ నూర్జహాన్ పెదబాబు కోరారు. శానిటేషన్ సిబ్బంది చేస్తున్నవృత్తి ఉద్యోగ బాధ్యతగా కాకుండా ఆరోగ్యాన్ని పణంగాపెట్టి సేవా భావంతో చేయడం వలనే నగర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటున్నారని.పాలకవర్గానికి కూడా మంచి పేరు తీసుకు వస్తున్నారని అభినందించారు. ప్రభువు దీవెనలతో సిబ్బంది అంతా ఆరోగ్యంగా ఉండాలని ప్రభువును ప్రార్థిస్తామన్నారు. కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంటుందన్నారు. నగర ప్రజలకు శానిటేషన్ సిబ్బంది ఎంతో సేవలు అందిస్తున్నారని ఆ ప్రభువు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకురావాలని. ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్, ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య నిరంతరం ప్రజలకు చేస్తున్న సేవలకు ప్రభువు కరుణ కటాక్షం శక్తి ప్రసాదించాలని అందరూ ప్రార్థించాలని ఎస్ఎంఆర్ పెదబాబు కోరారు. సానిటరీ సూపర్వైజర్ స్టీఫెన్ రాజు మాట్లాడుతూ మా ఆహ్వానాన్ని మన్నించి సెమీ క్రిస్మస్ వేడుకల్లో మేయర్ దంపతులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. మేయర్ దంపతులు బాధ్యతలు తీసుకున్నప్పటినుండి శానిటేషన్ సిబ్బందిని కుటుంబ సభ్యులుగా చూస్తూ మా కష్టసుఖాల్లో పాల్పంచుకొని మా కుటుంబాల అభివృద్ధికి వారు చేస్తున్న సహకారాన్ని ఎప్పుడూ మర్చిపోలేమన్నారు. మేయర్ దంపతులు రాజకీయంగా,వ్యాపార పరంగా మరింత అభివృద్ధి చెంది ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా మేమంతా ప్రభువును ప్రార్థిస్తున్నామన్నారు. మేయర్ దంపతులచే క్రిస్మస్ కేక్ కట్ కట్ చేయించి వారిని ఘనంగా సన్మానించారు.అనంతరం చిరుఉద్యోగులకు నూతన వస్త్రాలు మేయర్ దంపతులచేతుల మీదుగా బహుకరించారు. తొలుత బాణాసంచా కాలుస్తూ మేయర్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ శానిటేషన్ సూపర్వైజర్ సంభంగి తిరుమల రావు, పాస్టర్ రాజారత్నం పలువురు శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రిలు తదితరులు పాల్గొన్నారు Follow us on Website Facebook Instagram YouTube