మంచిర్యాల బస్టాండ్ పునరుద్ధరణకు చర్యలు
మంచిర్యాల: మంచిర్యాల పట్టణ ప్రజలు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో మంచిర్యాల బస్టాండ్ పునరుద్ధరణ పనులపై అధికారులు పరిశీలన నిర్వహించారు.
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సంబంధిత అధికారులతో కలిసి బస్టాండ్‌ను పరిశీలించారు. ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు, పునరుద్ధరణ పనులపై అధికారులతో చర్చించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. మంచిర్యాలలో సుమారు రూ.20 కోట్ల వ్యయంతో బస్టాండ్‌ను ఆధునీకరించే ప్రతిపాదన ఉందని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేలా పునరుద్ధరణ, ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
బస్టాండ్‌లో ప్రయాణికుల రాకపోకలు, అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర అంశాలపై అధికారులు వివరాలు అందించారు. పునరుద్ధరణ పనులను సమన్వయంతో చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ రాజశేఖర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు, నాయకులు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.