BREAKING
కూరెల్ల గ్రామంలో గ్రామదేవత బొడ్రాయి పండుగ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ సాయి దుర్గ యూత్ సంఘం పేద వాడి భూమి.. ఐతే 1బి పేరు మార్పు చేసిన రెవిన్యూ అధికారులు. అమరావతిలో సీఎం 7వ ఉన్నతస్థాయి సదస్సు.. పాల్గొన్న అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీ.. గణనీయంగా పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర హజరత్ సయ్యద్ నూర్ షావలి ఉరుసులో పాల్గొననున్న చల్లా ​వెంకటగిరి IIHTలో డిప్లొమా ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం రిథమ్ డాన్స్ కాంపిటీషన్ కార్యక్రమం ఆడబిడ్డ పెళ్లికి కుటుంబానికి ఆర్థిక చేయూత బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న మైనర్ గ్యాంగ్ అరెస్ట్ కూరెల్ల గ్రామంలో గ్రామదేవత బొడ్రాయి పండుగ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ సాయి దుర్గ యూత్ సంఘం పేద వాడి భూమి.. ఐతే 1బి పేరు మార్పు చేసిన రెవిన్యూ అధికారులు. అమరావతిలో సీఎం 7వ ఉన్నతస్థాయి సదస్సు.. పాల్గొన్న అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీ.. గణనీయంగా పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర హజరత్ సయ్యద్ నూర్ షావలి ఉరుసులో పాల్గొననున్న చల్లా ​వెంకటగిరి IIHTలో డిప్లొమా ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం రిథమ్ డాన్స్ కాంపిటీషన్ కార్యక్రమం ఆడబిడ్డ పెళ్లికి కుటుంబానికి ఆర్థిక చేయూత బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న మైనర్ గ్యాంగ్ అరెస్ట్
www.ntodaynews.com

ఉచితంగా కర్రసాము శిబిరం ప్రారంభించిన హనుమాన్ కర్ర సాము గ్రూపు సభ్యులు

తెలంగాణ
08 May, 2025 - 03:27 AM
230 వీక్షణలు
ఏలూరులో హనుమాన్ కర్ర సాము గ్రూపు సభ్యుల చేత వేసవి సెలవులను పురస్కరించుకొని సూర్య నమస్కారాలు మరియు కర్ర సాములో 35 రోజుల పాటు ఉచిత శిక్షణ శిబిరం.. ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని సందర్శించిన ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు గారు.. ఏలూరు శాంతినగర్ 9వ రోడ్డు చివరన హనుమాన్ కర్రసాము శిక్షణ శిబిరం కమిటీ వారు వేసవి సెలవులను పురస్కరించుకొని 35 రోజులపాటు పిల్లలకు ఉచితంగా కర్రసాములో విద్యను నేర్పిస్తున్నామని శిబిరం అధ్యక్షులు రెడ్డి చిన్న వెంకన్న తెలిపారు. గత బుధవారం శాంతినగర్ 9వ రోడ్డు లో ఈ ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరం కమిటీ వారి ఆహ్వానం మేరకు ఈరోజు ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు శిబిరాన్ని సందర్శించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 35 రోజుల పాటు ఔత్సాహికంగా ఉన్న చిన్నారులకు, పిల్లలకు ఉచితంగా కర్రసాములో చిన్న వెంకన్న గురువు గారి పర్యవేక్షణలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అందుకుగాను ముందుగా ఈ శిబిరం అధ్యక్షులు రెడ్డి చిన్న వెంకన్న గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు. బాల బాలికల మనోధైర్యానికి మరియు మనోవికాసానికి ఈ కర్రసాము శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని, చిన్నారులకు స్వీయ రక్షణ ప్రాముఖ్యత ఎంతో అవసరమని, వారిలో చిన్నతనం నుండే ఇటువంటి దృఢమైన పునాది పడాలి అనే సదుద్దేశంతో ఫలాపేక్ష లేకుండా సనాతనీయ బాల బాలికలందరికి, శారీరక దృఢత్వం కొరకు సూర్య నమస్కారాలు మరియు స్వీయ రక్షణ నిమిత్తం తెలుగింటి కర్ర సామును ఉచితంగా నేర్పించడం జరుగుతుందన్నారు. ఈ వేసవి సెలవుల్లో బాలబాలికలు, యువతి యువకులు తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ సదావకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని రెడ్డి అప్పల నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీరంకి పండు, కొండేటి రమేష్, హనుమాన్ కర్రసాము సభ్యులు ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, భోంస్లే ప్రశాంత్ , బంగారు నాయుడు , మాధవ్, ఉమా, కర్రీ వర్ధన్, వీరబాబు, పవన్, సౌజన్య, మయూరి, కొండేటి రమేష్, వెంకట్ మరియు భారీ సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు.. Follow us on Website Facebook Instagram YouTube