BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 19 September 2026, 06:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

యూపీహెచ్‌సీలో వైద్య సేవలు, సిబ్బంది పనితీరును పరిశీలించిన ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Sep, 2026 - 06:45 PM
24 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా చింతలపూడి: చింతలపూడి నగర పంచాయతీలో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం అనంతరం చింతలపూడి శాసనసభ్యులు స్థానిక పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (యూపీహెచ్‌సీ) సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, రోగులకు అందుతున్న సేవలపై సిబ్బందిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

యూపీహెచ్‌సీలో వైద్య సేవల కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. రోగుల నమోదు, వైద్య సేవలు, మందుల పంపిణీ తదితర అంశాలపై సిబ్బందితో మాట్లాడారు. అలాగే డేటా ఎంట్రీ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో స్వయంగా కంప్యూటర్‌ను ఆపరేట్ చేస్తూ పరిశీలించారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు. వైద్య సేవల కోసం వచ్చే ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే విధంగా సిబ్బంది పనిచేయాలని, రోగులకు అవసరమైన సేవలను సకాలంలో అందించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అఫ్రీన్, హెచ్‌డీఎస్ కమిటీ సభ్యులు సొంగా ఏసుపాదం, వైద్య సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.