BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

వికలాంగుల హక్కుల సాధనకు ఉద్యమం

తెలంగాణ
21 Feb, 2026 - 11:27 AM
302 వీక్షణలు
వికలాంగుల హక్కుల సాధనకు ఉద్యమం పెన్షన్ పెంపు, రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ ఎన్‌పిఆర్‌డీ 16వ ఆవిర్భావ దినోత్సవంలో పిలుపు NTODAY NEWS: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పెన్షన్‌ను ₹6,000లకు పెంచాలని, స్థానిక సంస్థలు మరియు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఎన్‌పిఆర్‌డీ నాయకులు డిమాండ్ చేశారు. ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని మరింత బలపరచాలని పిలుపునిచ్చారు. ఎన్‌పిఆర్‌డీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంఘం కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు కె. వెంకట్ జెండాను ఆవిష్కరించారు. కె. వెంకట్ మాట్లాడుతూ, జాలి, దయ కాదు, హక్కుల సాధన కోసం వికలాంగులను దేశవ్యాప్తంగా ఐక్యం చేయడమే లక్ష్యంగా 2010 ఫిబ్రవరి 21-22 తేదీల్లో కలకత్తాలో ఎన్‌పిఆర్‌డీ స్థాపించబడిందన్నారు. వికలాంగుల సమస్యలను పార్లమెంట్ వేదికగా ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. 2016 ఆర్పీడీ చట్టం సాధన, అంత్యోదయ రేషన్ కార్డులు, రైల్వే సౌకర్యాలు, ప్రజా ప్రదేశాలను అవరోధ రహితంగా మార్చడం, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ విలీనానికి వ్యతిరేకంగా పోరాటాలు వంటి అంశాల్లో సంఘం విజయాలు సాధించిందన్నారు. మహిళా వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం కూడా ప్రత్యేక పోరాటాలు నిర్వహించిందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు ఇచ్చిన హామీల అమలులో విఫలమయ్యాయని ఆరోపించారు. పెన్షన్‌ను ₹6,000లకు పెంచడంతో పాటు స్థానిక సంస్థల్లో, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో కనీసం 5 శాతం నిధులు వికలాంగుల సంక్షేమానికి కేటాయించాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయాలని, ప్రైవేట్ రంగంలో 5 శాతం ఉద్యోగాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు సురుపంగా ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్లేపల్లి స్వామి, జిల్లా కోశాధికారి కొత్త లలిత, నాయకులు కేతావత్ మురళి, శ్రీనివాస్ రెడ్డి, నాగు నరసింహ, పున్న శ్రీధర్, కర్ర కిషన్ తదితరులు పాల్గొన్నారు. సురుపంగా ప్రకాష్ జిల్లా అధ్యక్షుడు #NPRD #DisabilityRights #PensionDemand #ReservationRights #SocialJustice #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube