BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 28 May 2026, 01:55 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

ఘనంగా నాదెండ్ల మండల క్లస్టర్-1 మహానాడు కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
28 May, 2026 - 01:55 PM
150 వీక్షణలు

ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

నాదెండ్ల: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 28-05-2026 తేదీన నాదెండ్ల మండల క్లస్టర్-1 ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని నాయకులు, కార్యకర్తలు మహానాడు వేదిక నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి గ్రామంలోని ఎన్టీఆర్ సెంటర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మాన్యశ్రీ ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మహానాడు వేదిక వద్దకు చేరుకుని కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి మహానాడు వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.

మహానాడు సందర్భంగా పార్టీ జాతీయ నాయకత్వం అందించిన సందేశాలను కార్యకర్తలతో కలిసి వీక్షించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పని చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నాదెండ్ల మండల క్లస్టర్-1 పరిధిలోని గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.