BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 30 April 2026, 10:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నాయీ బ్రాహ్మణులకు భరోసా ఇచ్చింది టిడిపినే!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:20 PM
134 వీక్షణలు

నాయీ బ్రాహ్మణులకు భరోసా ఇచ్చింది టిడిపినే!

శ్రీకాళహస్తి: తరతరాలుగా కుల వృత్తిని ఆధారంగా చేసుకొని చాలీచాలని ఆదాయాలతో జీవనం సాగిస్తున్న నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు ఆశాకిరణంగా నిలిచింది తెలుగుదేశం పార్టీ అని టిడిపి నాయకులు పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు వైద్యం శాంతారాం, టిడిపి నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్ ఈ విషయాన్ని వెల్లడించారు.

రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన నాయీ బ్రాహ్మణ నాయకుడు చొప్పెళ్ళ శ్రీనును నాయీ బ్రాహ్మణ కుటుంబ సభ్యుల ఆశీస్సులతో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, గురువారం మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయం వద్ద ఘనంగా సత్కరించారు.

సాంప్రదాయిక వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న నాయీ బ్రాహ్మణులు ఆర్థిక, సామాజిక పరంగా ఎదగడానికి టిడిపి ఆవిర్భావం తర్వాతే మార్గాలు ఏర్పడ్డాయని నాయకులు తెలిపారు. టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు అండగా నిలిచారని, ప్రస్తుతం సీఎం నారా చంద్రబాబు నాయుడు మరియు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ కూడా వారి సంక్షేమంపై దృష్టి పెట్టారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో వైద్యం శాంతారాం, ఈదర శ్రీనివాసులు, పుల్లేటికుర్తి రమేష్, కోట చంద్రశేఖర్, వంగపూడి వాసు తదితరులు పాల్గొన్నారు.