BREAKING
thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
Date of Publish : 19 April 2026, 08:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నేడు సీఎం చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానం, ఉచిత వైద్య శిబిరం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Apr, 2026 - 08:45 PM
185 వీక్షణలు

నేడు సీఎం చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానం, ఉచిత వైద్య శిబిరం

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 19:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, ఈ నెల 20న సోమవారం అనగా నేడు, ఇబ్రహీంపట్నంలో రక్తదాన శిబిరంతో పాటు, ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మరియు తెలుగుదేశం పార్టీ-మైలవరం నియోజకవర్గం ఆధ్వర్యంలో “మెగా రక్తదాన శిబిరం మరియు ఉచిత మెగా వైద్య శిబిరం” నిర్వహిస్తున్నామని తెలిపారు. “రక్తదానం చేయండి - ప్రాణదాతలు కండి” అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం ముత్తవరపు స్వర్ణ ఏసీ కన్వెన్షన్, రింగ్ సెంటర్, ఇబ్రహీంపట్నం వద్ద ఉదయం 8:30 నుండి సాయంత్రం 4:00 వరకు జరుగుతుందని చెప్పారు. ఈ శిబిరాలలో సాధారణ వ్యాధులు, గుండె, క్యాన్సర్, చెవి, కంటి, దంత మరియు ఎముకల పరీక్షలు, షుగర్, బీపీ మరియు రక్త పరీక్షలు, ఉచిత వినికిడి పరీక్షలతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేయబడతాయి.

మైలవరం నియోజకవర్గంలోని కూటమి కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.