BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 19 June 2026, 03:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నేపాల్ అంతర్జాతీయ వేదికపై నూజివీడు యోగా సత్తా.. రెండు బంగారు పతకాలు కొల్లగొట్టిన ఏలూరు జిల్లా విద్యార్థులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jun, 2026 - 03:12 PM
116 వీక్షణలు

ఏలూరు జిల్లాలోని నూజివీడు పట్టణం మరోసారి అంతర్జాతీయ యోగా వేదికపై తన ప్రతిభను చాటుకుంది. తల్లాప్రగడ వెంకట కుమార్ కుటుంబం మూడు తరాలుగా యోగా విద్యను కొనసాగిస్తూ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో విజయ పరంపరను కొనసాగిస్తోంది.

ఈనెల జూన్ 7, 8, 9 తేదీల్లో నేపాల్ దేశంలోని పోఖరా నగరంలో జరిగిన ఇంటర్నేషనల్ యూత్ గేమ్స్ 2026లో నూజివీడు విద్యార్థులు అద్భుత ప్రదర్శనతో రెండు బంగారు పతకాలు సాధించారు.

అండర్–30 విభాగంలో తల్లాప్రగడ సాయి ప్రసన్న లక్ష్మీ యోగాసనాల్లో స్వర్ణ పతకం గెలిచి దేశానికి గౌరవం తెచ్చింది. అండర్–18 విభాగంలో ముడుంబై వి ఎల్ బి ఆర్ భావన అద్భుత నైపుణ్యంతో బంగారు పతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది.

అంతేకాకుండా కేవలం నాలుగు సంవత్సరాల చిన్నారి రెడ్డి యోగేశ్వరి, వేదికపై చేసిన యోగాసన ప్రదర్శనతో నిర్వాహకుల ప్రశంసలు అందుకుని ప్రత్యేక సత్కారం పొందింది.

మూడు తరాలుగా యోగా సాధన కొనసాగిస్తున్న ఈ కుటుంబం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో విజయాలను సాధిస్తూ నూజివీడుకు కొత్త గర్వాన్ని తెచ్చిందని స్థానికులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.