BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 28 August 2026, 11:05 am
Posted by : కూనురు మధు

నేపాల్ వరదల్లో పెద్దకాపర్తి మహిళ అదృశ్యం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
28 Aug, 2026 - 11:05 AM
650 వీక్షణలు

నేపాల్ వరదల్లో నల్లగొండ మహిళ గల్లంతు

నేపాల్‌లో సంభవించిన భారీ వరదల్లో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన కందిమల్ల సుహాసిని రెడ్డి (42) గల్లంతైనట్లు సమాచారం. దీంతో ఆమె కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సుహాసిని రెడ్డి తన భర్త నన్నూరి సంజీవరెడ్డి, ఇద్దరు కుమారులతో కలిసి కొంతకాలంగా ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నారు. హైదరాబాద్‌లోని ఇంటి గృహప్రవేశ కార్యక్రమం కోసం ఈ నెల 19న కుటుంబంతో కలిసి భారత్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం ఈ నెల 23న విహారయాత్ర నిమిత్తం నేపాల్‌కు వెళ్లారు.


అయితే నేపాల్‌లో భారీ వర్షాలు, వరదలు సంభవించడంతో సుహాసిని రెడ్డి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆమె కోసం సంబంధిత అధికారులు, కుటుంబ సభ్యులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.