BREAKING
thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం
Date of Publish : 03 June 2026, 06:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నీట్ అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రిని తొలగించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ డిమాండ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 06:53 PM
186 వీక్షణలు

నీట్ అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రిని తొలగించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ డిమాండ్

ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో నిర్వహించిన పత్రికా సమావేశంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి హరినాథ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. "నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)"లో నెలకొన్న అవినీతి, అక్రమాలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. మంత్రి రాజీనామా చేయకపోతే కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని కోరారు.

ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ), రెవల్యూషనరీ యూత్ అసోసియేషన్ (ఆర్వైఏ) ఆధ్వర్యంలో జూన్ 5న రాష్ట్రవ్యాప్తంగా నీట్ పరీక్షల అక్రమాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడంలో విఫలమైందని హరినాథ్ ఆరోపించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును కొందరి లాభాల కోసం బలిపెడుతున్న విద్యా విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ఉద్యమించాలని కోరారు.

నీట్, సీయూఈటీ, యూజీసీ-నెట్, సీబీఎస్ఈ తదితర పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పలుమార్లు ప్రశ్నాపత్రాల లీకేజీలు జరిగినప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

కోచింగ్ సెంటర్ల కోసం లక్షలాది మంది విద్యార్థులు భారీ మొత్తంలో ఖర్చు చేసి తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్న హరినాథ్, ఎన్టీఏను రద్దు చేసి కొత్త వ్యవస్థను తీసుకురావాలని కోరారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూన్ 6న నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా వివిధ ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపారు.