BREAKING
thumb ● మునగపాకలో అప్పన్న స్వామి ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● మునగపాకలో అప్పన్న స్వామి ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
Date of Publish : 27 June 2026, 12:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నిండు జీవితానికి రెండు చుక్కలు.. పోలియో రహిత సమాజం అందరి లక్ష్యం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 12:05 PM
96 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట: జూన్ 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకుని విస్సన్నపేటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జననం నుంచి ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మండల వైద్యాధికారి కొప్పుల శ్రీనివాస్ మాట్లాడుతూ, "ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎక్కడ ఉన్నా ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. ప్రయాణంలో ఉన్నవారికి కూడా బస్టాండ్లలో ప్రత్యేక కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు వేసే సౌకర్యం కల్పించాం" అని తెలిపారు.

మండల వ్యాప్తంగా మొత్తం 45 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా ప్రతి తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి పోలియో చుక్కలు వేయించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చిన్న రత్నాలు, ఈఓ హరీకుమార్, డిప్యూటీ డీటీ విజయ భాస్కర్, హెల్త్ వర్కర్లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.