BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 04 June 2026, 09:07 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

నిరుద్యోగ యువతీ యువకులకు గొప్ప శుభవార్త

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
04 Jun, 2026 - 09:07 PM
123 వీక్షణలు

నిరుద్యోగ యువతీ యువకులకు గొప్ప శుభవార్త – జూన్ 16న చిలకలూరిపేటలో మెగా జాబ్ మేళా : డాక్టర్  కందిమళ్ళ  సాంబశివరావు

చిలకలూరిపేట: నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ అథారిటీ, మాజీ మంత్రి మరియు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన చిలకలూరిపేటలోని ప్రత్తిపాటి గార్డెన్స్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు డాక్టర్  కందిమళ్ళ సాంబశివరావు  తెలిపారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యను పూర్తి చేసిన యువత ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి దరఖాస్తులు చేయడం, ఇంటర్వ్యూలకు హాజరుకావడం వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అయితే ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ చొరవతో వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ కంపెనీలను చిలకలూరిపేటకు తీసుకువచ్చి స్థానికంగానే ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు.


ఈ మెగా జాబ్ మేళాలో జోయాలుక్కాస్, డీమార్ట్, రిలయన్స్ జియో, టాటా క్యాపిటల్, కియా, ఐసుజు, ఎస్‌బీఐ కార్డ్, ఫ్లిప్‌కార్ట్, జెప్టో, క్వెస్, మహీంద్రా సీఐఈ, ఎంఆర్ఎఫ్ తదితర 40కు పైగా ప్రముఖ సంస్థలు పాల్గొననున్నాయని నిర్వాహకులు వెల్లడించారు. వివిధ విభాగాల్లో 2,000కు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.


ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చని పేర్కొన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీ యువకులు తమ విద్యార్హతల ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, బయోడేటా, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


గతంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాల ద్వారా అనేక మంది యువత ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడ్డారని గుర్తుచేసిన డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, ఈ జాబ్ మేళా కూడా వేలాది మంది నిరుద్యోగులకు ఆశాకిరణంగా నిలుస్తుందని అన్నారు. అర్హత కలిగిన యువతీ యువకులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకొని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాల కోసం 7779858789, 7842747682, 9848793357, 7702921219 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.


ఇలాంటి యువతాభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు డాక్టర్  కందిమళ్ళ సాంబశివరావు అభినందనలు తెలిపారు.