BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

నిరవధిక నిరాహార దీక్షలకు పెరుగుతున్న ప్రజాదరణ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
సిర మహేష్ రామన్నపేట మండల ప్రతినిధి
17 Mar, 2026 - 11:50 AM
197 వీక్షణలు

వంద పడకల ఆసుపత్రి హామీ ఇచ్చేదాకా దీక్ష విరమించేది లేదు

సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జిల్లెల పెంటయ్య

ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ ఇచ్చేదాకా నిరవధిక దీక్షలు విరమించేది లేదని ప్రాణాలు పోయినా దీక్ష కొనసాగిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జిల్లాల పెంటయ్య తెలిపారు.ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిపిఎం రామన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలోని చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరిన సందర్భంలో మండలంలోని వివిధ రంగాల సంస్థలు, ప్రజల నుండి ప్రజాదరణ పెరుగుతుందని  అన్నారు. దీక్షలు రెండో రోజుకు చేరిన సందర్భంగా వివేకానంద డివైన్ మోడల్ స్కూల్, డాన్ బాస్కో స్కూల్ యాజమాన్యం విద్యార్థిని విద్యార్థులు, మండల పాత్రికేయులు,మండల మెడికల్ షాప్స్(కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్) మండల అసోసియేషన్ సభ్యులు, మండల ఎమ్మార్పీఎస్ నాయకులు, లాయర్స్ యూనియన్ అసోసియేషన్ నాయకులు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ,పూల బండ్ల షాప్ల మహిళలు స్వచ్ఛందంగా నిరవధిక నిరాహార దీక్షలో శిబిరానికి విచ్చేసి సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఒకవైపు నాయకుల ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి అధికారుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడం ప్రజాపాలనలో ప్రజల కోసం పోరాటానికి మద్దతు తెలపకపోవడం విచారకరమని అన్నారు. వంద పడకల ఆస్పత్రి కొరకు ప్రజాప్రతినిధులు అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని లేని పక్షంలో రామన్నపేట మండల బందుకు పిలుపునిచ్చి వివిధ రంగాల ప్రజలను, మేధావులను,వివిధ రాజకీయ పార్టీలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు  

ఈ కార్యక్రమంలో దీక్ష సభ్యులు సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూరెళ్ళ నరసింహ చారి, కందుల హనుమంతు, మండల కమిటీ సభ్యులు మాజీ వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, గొరిగె సోములు,వేముల సైదులు,శానగొండ రాము ఉన్నారు. మద్దతు తెలిపిన వారిలో వివేకానంద డివైన్ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ తిరగడం మల్లికార్జున్,స్కూల్ యాజమాన్యం పిట్టల మత్స్యగిరి, మండల మెడికల్ షాప్స్ యజమాన్యం రాపోలు రమేష్,నరసింహ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఈర్లపల్లి మల్లయ్య మండల అధ్యక్షులు నోముల చిరంజీవి, లాయర్స్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు మామిడి వెంకటరెడ్డి, పాల్వంచ జగతయ్య,పూల బండ్ల షాప్ మహిళలు శంకరమ్మ, లక్ష్మమ్మ తదితరులు స్వచ్ఛందంగా పాల్గొని దీక్షలకు మద్దతు తెలిపారు 

క్షీణిస్తున్న నాయకుల ఆరోగ్యం

 నిరవధిక  దీక్షలో కూర్చున్న నాయకుల ఆరోగ్యం క్షీణిస్తుందని యాత్ర సభ్యులలో ఒకరికి బి.పి లెవెల్స్ ఎచ్చుతగ్గులవుతున్నాయని,ఇద్దరు వ్యక్తులకు షుగర్ లేవల్స్ తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు

దీక్షలలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బల్బురి అంజయ్య మండల నాయకులు గన్నెబోయిన విజయభాస్కర్,గాదె నరేందర్, పులి భిక్షం,ఎండి రషీద్ ,బొడిగె రజిత, నీల ఐలయ్య,మునుకుంట్ల లెనిన్,పావురాల మత్స్యగిరి గంటపాక శివకుమార్ పుట్టల ఉదయ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు