BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 28 April 2026, 09:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నిషేధిత పత్తి విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు – విస్సన్నపేట మండలంలో ప్రత్యేక తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Apr, 2026 - 09:45 PM
143 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట లో వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు, జిల్లాలో నిషేధిత పత్తి విత్తనాలు (HT) అక్రమ అమ్మకాల నియంత్రణ కోసం ప్రత్యేక స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్క్వాడ్ ద్వారా అన్ని మండలాల్లో పర్యవేక్షణ చర్యలు కఠినంగా అమలు చేస్తున్నారు.

స్క్వాడ్‌లో ADA (PP) ఎ. మద్దులేటి, AO వై. శివ శంకర్ రెడ్డి, మండల వ్యవసాయాధికారి జీ.రాజ్యలక్ష్మీ సభ్యులుగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో, విస్సన్నపేట మండల పరిధిలో ఎవరైనా వ్యక్తులు లేదా విత్తన డీలర్లు నిషేధిత పత్తి విత్తనాలను నిల్వ చేయడం, రవాణా చేయడం లేదా విక్రయించడం చేసినట్లయితే, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. సంబంధిత డీలర్ల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు కేసులు నమోదు చేయబడతాయని స్పష్టం చేశారు.

ఈ చర్యలలో భాగంగా విస్సన్నపేట పట్టణంలోని సీడ్స్ షాపుల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో షాపుల రిజిస్టర్లు, స్టాక్ వివరాలు, విక్రయ పత్రాలను సమగ్రంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ADA (PP) ఎ. మద్దులేటి మాట్లాడుతూ, అనుమతులు లేని నిషేధిత పత్తి విత్తనాల అమ్మకాలు జరిపితే ఎలాంటి ఉపశమనం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రైతులకు సూచనలు:

అనుమతి పొందిన, ధృవీకరించిన విత్తనాలనే కొనుగోలు చేయాలి

విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లు/రసీదు తీసుకోవాలి

అనుమానాస్పద విత్తనాలు లేదా అక్రమ అమ్మకాలపై సమాచారం ఉంటే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలి

నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని  మండల వ్యవసాయ అధికారి జీ.రాజ్యలక్ష్మీతెలియజేశారు.