BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 27 May 2026, 06:22 pm
Posted by : V శ్రీనివాస్

​ నివాసాల పైనుంచి వెళ్తున్న విద్యుత్ తీగల తొలగింపునకు మేయర్ ఉత్తర్వులు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
27 May, 2026 - 06:22 PM
139 వీక్షణలు

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్, శ్రీరాంపూర్ బస్టాండ్ మజీద్ వద్ద నివాసాల మీదుగా వెళ్తున్న విద్యుత్ లైన్ల సమస్యపై స్థానిక కార్పొరేటర్ ఫిర్యాదు మేరకు మేయర్ ధర్ని మధుకర్ స్పందించి, తక్షణ పరిష్కారానికి ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరాంపూర్ బస్టాండ్ మజీద్ సమీపంలో నివాసాల పై నుండి వెళ్తున్న ఎల్.టి. లైన్ల వలన స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని 29వ డివిజన్ కార్పొరేటర్ బండారి సుధాకర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ దృష్టికి తీసుకువచ్చారు. మేయర్ మధుకర్ సంఘటనా స్థలానికి వెళ్లి నివాసాలను పరిశీలించి, సమస్యను అర్థం చేసుకున్నారు. అనంతరం విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్‌తో ఫోన్ ద్వారా సంప్రదించి, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు. మేయర్ చొరవతో విద్యుత్ లైన్ల మార్పునకు చర్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ చర్యల వలన స్థానిక నివాసితులు భద్రతతో పాటు, విద్యుత్ సంబంధిత ప్రమాదాల నుండి ఉపశమనం పొందుతారని భావిస్తున్నారు. సమస్య పరిష్కారానికి మేయర్ చూపిన చొరవ పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, మేయర్ ధర్ని మధుకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బండారి సుధాకర్, ఇతర నాయకులు, స్థానికులు పాల్గొన్నారు