BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 16 March 2026, 02:44 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నకిలీ మొబైల్ యాక్సెసరీస్‌పై విజిలెన్స్ పంజా

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Mar, 2026 - 02:44 PM
164 వీక్షణలు

ఏలూరులో మహదేవ్ మొబైల్స్‌లో ఆకస్మిక దాడులు

ఏలూరు, మార్చి 16: ఏలూరు నగరంలోని మొబైల్ యాక్సెసరీస్ దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరోసారి దాడులు నిర్వహించారు. సోమవారం నగరంలోని ఆర్‌.ఆర్‌.పేటలో ఉన్న మహదేవ్ మొబైల్స్ దుకాణంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ (డూప్లికేట్) మొబైల్ యాక్సెసరీలను అసలు వస్తువులుగా నమ్మిస్తూ విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

తనిఖీల్లో భాగంగా దుకాణంలోని సెల్‌ఫోన్ విడిభాగాలు, మొబైల్ యాక్సెసరీస్ స్టాక్‌ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విక్రయాలకు సంబంధించిన బిల్లులు, స్టాక్ రిజిస్టర్లు, ఒరిజినల్ సామాగ్రికి సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలన చేస్తున్నారు.

నాణ్యతలేని వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం దుకాణంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.