BREAKING
thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య గారి ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య గారి ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
Date of Publish : 22 June 2026, 04:56 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడు ఎక్సైజ్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా అధికారులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 04:56 PM
154 వీక్షణలు

ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కే.వి. నాగ ప్రభు కుమార్ నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌ను సోమవారం సందర్శించారు.

ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను పరిశీలించిన అధికారులు, అనంతరం సిబ్బందితో సమావేశమై స్టేషన్ పనితీరును సమీక్షించారు. గత ఏడాది కాలంగా అదుపులో ఉన్న ఐ.డి. మద్యం (ఇల్లిసిట్ డిస్టిల్డ్ లిక్కర్) తయారీ, విక్రయాలు మళ్లీ పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గతంలో ఐ.డి. మద్యం కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై భారతీయ నాగరిక భద్రతా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) సెక్షన్-129 కింద కేసులు నమోదు చేయాలని, పరారీలో ఉన్న నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని సూచించారు. అలాగే పునరావాస చర్యలు చేపట్టడంతో పాటు వారి కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై నిరంతర తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలని, ప్రజలు బహిరంగంగా మద్యం సేవించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎ. మస్తానయ్య తెలిపారు.