BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

నోరు ఉందని మాజీ మంత్రి కొప్పుల ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదు..

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
20 Apr, 2026 - 03:12 PM
142 వీక్షణలు

నోరు ఉందని మాజీ మంత్రి కొప్పుల ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదు..

అక్కపల్లి లిఫ్ట్ తో పాటు రోళ్లవాగు మిగిలిన ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..

చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించడం లక్ష్యం..

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

ధర్మపురి నియోజకవర్గంలో రోళ్లవాగు, అక్కెపెల్లి ఎత్తిపోతల పథకంతో పాటు నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించే బాధ్యత తాను తీసుకుంటానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి అక్కెపెళ్లి ఎత్తిపోతల పథకాన్ని మంత్రి సందర్శించారు. 

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గంలో 90 శాతం మంది వ్యవసాయ ఆధారితంగా జీవనం సాగిస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలోని రైతులకు సాగునీటిని అందించడానికి రోళ్ళవాగుతో పాటు అక్కెపల్లి ఎత్తిపోతల పథకం, వెల్గటూర్ చెరువు, స్తంభంపల్లి, రంగదామంపల్లి, యశ్వంతరావుపేట చెరువు కూడికతీత పనులు పూర్తి చేసి నియోజకవర్గంలో ని ప్రతి ఎకరాకు సాగునీటిని అందిస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 

రైతుల ప్రయోజనమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైందని అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించి అంచనాలు పెంచి మధ్యలోనే నిలిపివేశారని మంత్రి ఆరోపించారు. నియోజకవర్గంలోని రైతులకు సాగునీటిని అందించే రోళ్ల వాగు ప్రాజెక్ట్ భూ సేకరణ చేయకుండానే పనులు ప్రారంభించారని మంత్రి అన్నారు.

రోళ్లవాగు ప్రాజెక్ట్ విషయంలో 

ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ రూ. 60 కోట్ల అంచనాలతో 2016లో ప్రారంభించి రూ. 140 కోట్లకు పెంచారని మంత్రి ఆరోపించారు. అంచనాలు పెంచిన ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు పూర్తి కాలేదో మాజీ మంత్రి కొప్పుల సమాధానం చెప్పాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. రిజర్వ్ ఫారెస్ట్ అనుమతి లేకుండానే రోళ్లవాగు ప్రాజెక్టు ప్రారంభించారని మంత్రి అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రోళ్ళవాగు ప్రాజెక్టు రిజర్వ్ ఫారెస్ట్ అనుమతులు తీసుకువచ్చి ఇందుకు సంబంధించి ఆడవిశాఖకు రూ.31 లక్షలు చెల్లించినట్లు మంత్రి తెలిపారు. నోరు ఉందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడితే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు.

అక్కపెల్లి ఎత్తిపోతలకు సంబంధించి కనీసం డ్రాయింగ్ పనులు చేయించలేని కొప్పుల ఈశ్వర్ తనపై తప్పుడు ఆరోపణ చేస్తున్నారని మంత్రి అన్నారు. వారం రోజుల క్రితం అక్క పెళ్లి ఎత్తిపోతలకు సంబంధించి డ్రాయింగ్ పనులు పూర్తి అయ్యాయని మంత్రి తెలిపారు. త్వరలోనే అక్కపెల్లి రిజర్వాయర్ పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.

పత్తిపాక రిజర్వాయర్ పై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రాజెక్టుగా నామకరణం చేసి పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేస్తానని చెప్పిన మాటలు ఏమయ్యాయి అని మంత్రి ప్రశ్నించారు. ధర్మపురి నియోజకవర్గంలో మేడారం రిజర్వాయర్, కాళేశ్వరం ప్రాజెక్ట్ పేస్ -2లో భాగంగా వందల ఎకరాల భూములు సేకరించి స్థానిక రైతులకు చుక్కనీరు ని ఇవ్వలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకుంటే తాను ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో చేసిన పనులకు బిల్లులు ఇప్పించి పనులు కొనసాగే విధంగా చర్యలు తీసుకుంటున్నానని మంత్రి తెలిపారు. 

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో చర్చించి నియోజకవర్గంలోని పెండింగ్ పనులు పూర్తిచేసి రైతులకు అండగా నిలుస్తామని మంత్రి తెలిపారు. మంత్రి వెంట పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటు రైతులు ఉన్నారు.