BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 19 September 2026, 06:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో 101వ అంగన్వాడీ కేంద్రంలో జాతీయ పోషకాహార మహోత్సవాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Sep, 2026 - 06:45 PM
100 వీక్షణలు

పెనుగొలనులో జాతీయ పోషకాహార మహోత్సవాలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని 101వ అంగన్వాడీ కేంద్రంలో శనివారం జాతీయ పోషకాహార మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం ప్రాధాన్యత, నాణ్యతపై అవగాహన కల్పించారు. చిన్నారులు ఆరోగ్యంగా ఎదగడంతో పాటు గర్భిణీలు, బాలింతల ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీ కేంద్రాల సేవలు కీలకమని తెలిపారు. రోజువారీ ఆహారంలో సీజన్‌కు అనుగుణంగా లభించే ఆకుకూరలు, తాజా పండ్లు, పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచించారు. కుటుంబ ఆరోగ్యానికి పరిశుభ్రత ఎంతో ముఖ్యమని, ఇంటి ప్రాంగణంతో పాటు పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని వివరించారు. భోజనం చేసే ముందు, వంట చేయడానికి ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. పరిశుభ్రమైన ఆహారం, సమతుల్య పోషకాహారం తీసుకోవడం ద్వారా చిన్నారులు, మహిళలు ఆరోగ్యంగా ఉండవచ్చని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు దేవర దివ్య, పీవీ సాయి లక్ష్మి, బి. నాగమణి, కె. లింగమ్మతో పాటు మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.