BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 22 August 2026, 11:03 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఒంగూరు జ్యోతిరావు ఫూలే గురుకులంలో విద్యార్థినులకు శక్తి యాప్‌పై అవగాహన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 11:03 AM
62 వీక్షణలు

ఒంగూరు జ్యోతిరావు ఫూలే గురుకులంలో విద్యార్థినులకు శక్తి యాప్‌పై అవగాహన

ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం. సుబ్బారావు ఆధ్వర్యంలో శక్తి టీం సభ్యులు పెదవేగి మండలం ఒంగూరు గ్రామంలోని జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు శక్తి యాప్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

మహిళలు, బాలికల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ రూపొందించిన శక్తి యాప్ అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించే మొబైల్ అప్లికేషన్ అని విద్యార్థినులకు వివరించారు. ఆపద సమయంలో శక్తి యాప్ ద్వారా సమాచారం అందించడం లేదా 112కు కాల్ చేయడం ద్వారా సమీపంలోని శక్తి టీం గస్తీ బృందాలు వెంటనే స్పందించి సహాయం అందిస్తాయని తెలిపారు.

మహిళల భద్రతకు నమ్మకమైన సాధనంగా శక్తి యాప్ పనిచేస్తుందని, ఒంటరిగా ప్రయాణించే సమయంలో భద్రతా భావాన్ని కల్పిస్తుందని వివరించారు. యాప్‌లో మహిళల హక్కులు, చట్టాలు, పోలీస్ సహాయ నంబర్లు, సైబర్ నేరాలు, వేధింపులపై అవగాహన పొందే అవకాశం ఉందన్నారు.

అత్యవసర సమయాల్లో 112 ఎమర్జెన్సీ నంబర్, 181 మహిళా హెల్ప్‌లైన్ సేవలను నేరుగా వినియోగించుకోవచ్చని చెప్పారు. అలాగే ఫ్రెండ్ ట్రాకింగ్, సేఫ్టీ షేరింగ్ సదుపాయాల ద్వారా కుటుంబ సభ్యులు, స్నేహితులతో లైవ్ లొకేషన్ పంచుకునే అవకాశం ఉందని వివరించారు.

వేధింపులు, కిడ్నాప్ ప్రయత్నాలు, గృహ హింస, రహదారిపై ఒంటరిగా ప్రయాణించే సమయంలో లేదా అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గమనించినప్పుడు శక్తి యాప్‌ను వినియోగించాలని సూచించారు.

ప్రతి మహిళా, విద్యార్థిని తమ మొబైల్ ఫోన్‌లో శక్తి యాప్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, ఇది మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచే భద్రతా సాధనమని ఇన్స్పెక్టర్ ఎం. సుబ్బారావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు, జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాల ఉపాధ్యాయినులు, విద్యార్థినులు పాల్గొన్నారు.