BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 11 February 2026, 05:21 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఉపాధ్యాయ వర్ధంతి కార్యక్రమం నిర్వహణ

తెలంగాణ
11 Feb, 2026 - 05:21 AM
326 వీక్షణలు
  అంత్యోదయ దివస్ సందర్భంగా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి కార్యక్రమం నిర్వహణ NTODAY NEWS: కాకినాడ జిల్లా గొల్లప్రోలు ప్రతినిధి  బోరా శివారెడ్డి గొల్లప్రోలు పట్టణ బీజేపీ కార్యాలయంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతిని అంత్యోదయ దివస్‌గా ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిట్టా మధు మాట్లాడుతూ, 1916 సెప్టెంబర్ 25న జన్మించిన దీనదయాళ్ ఉపాధ్యాయ సమగ్ర మానవతావాదం (ఏకాత్మ మానవతావాదం) అనే రాజకీయ తత్వాన్ని ప్రతిపాదించారని తెలిపారు. ప్రతి మానవుని శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మల సమగ్ర వికాసమే సమాజ పురోగతికి పునాది అని ఆయన భావించారని వివరించారు. భారత్ స్వావలంబన దేశంగా ఎదగాలని, పాశ్చాత్య సిద్ధాంతాలపై పూర్తిగా ఆధారపడకూడదని ఉపాధ్యాయ అభిప్రాయపడినట్లు పేర్కొన్నారు. భారతీయ జనసంఘ్‌కు సిద్ధాంతాత్మక దిశానిర్దేశం చేసిన నేతగా, అనంతరం భారతీయ జనతా పార్టీకి మార్గదర్శకుడిగా ఉపాధ్యాయ సేవలు చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కర్రి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు మేడసాని కామరాజు, కోశాధికారి పెద్దిశెట్టి మహేష్, ఓబీసీ నాయకుడు చీపూరి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. #DeendayalUpadhyaya #AntyodayaDiwas #IntegralHumanism #BJP #JanSangh #PoliticalIdeology #Gollaprolu #KakinadaDistrict #Tribute Follow us on Website Facebook Instagram YouTube