BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 26 June 2026, 06:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పాప్రికా మిర్చి కాంట్రాక్ట్ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:45 PM
89 వీక్షణలు

ఏలూరు జిల్లా, లింగపాలెం, జూన్ 26: లింగపాలెం మండలంలోని లింగపాలెం గ్రామంలో కర్షక్ మిత్ర, లింగపాలెం ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో పాప్రికా మిర్చి కాంట్రాక్ట్ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా యాక్సిస్ డెవలప్మెంట్ సర్వీసెస్ సీనియర్ మేనేజర్ సుబ్బారావు మాట్లాడుతూ, కర్షక్ మిత్ర ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కాంట్రాక్ట్ వ్యవసాయ విధానం రైతులకు ధరల హెచ్చుతగ్గుల నుంచి రక్షణ కల్పించేలా రూపొందించబడిందని తెలిపారు. మార్కెట్‌లో ధరలు మారుతున్నా రైతులకు ముందుగానే మిర్చి కొనుగోలు ధరను నిర్ణయించడం ద్వారా ఆదాయానికి భరోసా కల్పిస్తామని చెప్పారు.

అలాగే పంట సాగు నుంచి కొనుగోలు వరకు ప్రతి అంశాన్ని రైతులతో చర్చించి, పరస్పర అంగీకారంతోనే కొనుగోలు ప్రక్రియ చేపడతామని వివరించారు. దీంతో రైతులు మార్కెట్ అనిశ్చితిపై ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కర్షక్ మిత్ర మేనేజ్‌మెంట్ ప్రతినిధులు సంజయ్, అశోక్, గ్రామోదయ ట్రస్టింగ్ సంస్థ ప్రతినిధి శ్రీనివాస్‌తో పాటు లింగపాలెం మండలం పరిసర ప్రాంతాలకు చెందిన పాప్రికా మిర్చి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు.