BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 27 August 2026, 07:37 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెదకాకాని : భ్రమరాంబ అమ్మవారికి మంగళసూత్రాలు సమర్పించిన అంబటి మురళీకృష్ణ

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 07:37 PM
59 వీక్షణలు

పెదకాకాని, గుంటూరు జిల్లా : భ్రమరాంబ అమ్మవారికి మంగళసూత్రాలు సమర్పించిన అంబటి మురళీకృష్ణ

అమ్మవారి అపచారానికి క్షమాపణలు కోరుతూ నగర సంకీర్తన.. భక్తి పారవశ్యంతో మారుమోగిన కాకాని

పవిత్ర శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజా సమయంలో ప్రసిద్ధి చెందిన కాకాని దేవస్థానంలోని శ్రీ గంగా భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రం అపహరణ ఘటనపై భక్తుల్లో ఆవేదన వ్యక్తమవుతున్న నేపథ్యంలో, అమ్మవారికి క్షమాపణలు కోరుతూ పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో నగర సంకీర్తన నిర్వహించారు.

పెదకాకాని పోలీస్ స్టేషన్ సమీపంలోని సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న వై జంక్షన్ వద్ద శ్రీ వరలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన నగర సంకీర్తన కాకాని పట్టణంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం వరకు కొనసాగింది. అమ్మవారి నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ.. అమ్మవారి మంగళసూత్రం కనిపించకుండా పోవడం బాధాకరమైన ఘటన అని, ఈ అపచారానికి అమ్మవారిని క్షమాపణలు కోరుతూ ప్రజలందరిపై ఆదిపరాశక్తి అనుగ్రహం ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

అమ్మవారి నాన్తాడు మంగళసూత్రం కనిపించకుండా పోయిన ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడి విషయంలో కేసు నమోదు చేయడంలో ఆలస్యం జరిగిందని ఆరోపించారు. ఈ ఘటన వెనుక ఉన్న వాస్తవాలను బయటకు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

తాను స్వయంగా కాకాని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిన అనంతరం పాదయాత్రగా భ్రమరాంబ అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. మంగళసూత్రం అపహరణకు పాల్పడిన వారిని తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు.

తన కన్నతల్లి కలలో కనిపించి పసుపు కుంకుమతో ఉన్న మంగళసూత్రాలను అమ్మవారికి సమర్పించాలని సూచించినట్లు అంబటి మురళీకృష్ణ తెలిపారు. ఆ భావోద్వేగంతోనే భ్రమరాంబ అమ్మవారికి మంగళసూత్రాలు సమర్పించినట్లు పేర్కొన్నారు.

గతంలో ఆలయంలో ఆభరణాలు పోయిన సమయంలోనే దొంగలను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. ఆలయ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.

రాబోయే రోజుల్లో భ్రమరాంబ అమ్మవారికి నాన్తాడు కూడా పొన్నూరు నియోజకవర్గ భక్తుల సహకారంతో తయారు చేసి సమర్పించేందుకు తన వంతు సహాయం చేస్తానని తెలిపారు.

అనంతరం ఆళ్ల వీరరాఘవమ్మ చేతుల మీదుగా నగర సంకీర్తనలో పాల్గొన్న భక్తులకు నైవేద్య, తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల, భక్తులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.