BREAKING
thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ
Date of Publish : 26 June 2026, 06:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెదవేగిలో కొత్త ఆయిల్ ఫెడ్ కర్మాగారం నిర్మించాలి.. రైతుల సమస్యలు పరిష్కరించాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:45 PM
94 వీక్షణలు

ఏలూరు, జూన్ 26:

పెదవేగిలో అత్యాధునిక సాంకేతికతతో కొత్త ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని నిర్మించాలని, ఓఈఆర్ (ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేటు) పేరుతో ఆయిల్ పామ్ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

ఏలూరులోని ఉద్దరాజు రామం భవనంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జూలై 3, 4, 5 తేదీల్లో ఏలూరులో జరిగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభల్లో ఆయిల్ పామ్ రైతుల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించి తీర్మానం చేయనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన 20.5 శాతం ఓఈఆర్ను తగ్గించి 17.5 శాతానికి పరిమితం చేయాలని ఆయిల్ పామ్ కంపెనీలు కోర్టును ఆశ్రయించడం రైతు వ్యతిరేక చర్య అని ఆయన విమర్శించారు. రైతులకు వ్యతిరేకంగా కంపెనీలు ఏకమై కోర్టుకు వెళ్లడం సమంజసం కాదన్నారు.

ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని, రైతులకు మద్దతుగా ప్రభుత్వాలే కోర్టులో పోరాడాలని కోరారు. రైతులు కోర్టులో ఇంప్లీడ్ అయ్యేందుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వాలే భరించాలని సూచించారు.

ఓఈఆర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే పెదవేగిలో ఆధునిక సాంకేతికతతో కొత్త ఆయిల్ ఫెడ్ కర్మాగారం ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన అనుమతులను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం లాభాల్లో ఉన్న పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని విక్రయించే ప్రయత్నాలు సరికావని, గతంలో రైతుల ఐక్యతతో ప్రైవేటీకరణను అడ్డుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

అలాగే రైతులకు అధిక దిగుబడులు ఇచ్చే నాణ్యమైన ఆయిల్ పామ్ మొక్కలను అందుబాటులోకి