BREAKING
ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 28 July 2026, 08:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలను హైస్కూల్లో అమరావతి ఛాంపియన్‌షిప్-2026 క్రీడలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jul, 2026 - 08:32 PM
128 వీక్షణలు

పెనుగొలను హైస్కూల్లో అమరావతి ఛాంపియన్‌షిప్-2026 క్రీడలు ప్రారంభం

పెనుగొలను, జులై 28: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని కోట మార్కండేయ జిల్లా పరిషత్ హైస్కూల్లో తిరువూరు నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్-2026 క్రీడా పోటీలను మంగళవారం ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.

హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు, వ్యాయామం ఎంతో అవసరమని తెలిపారు. క్రీడా పోటీలను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు.

అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి వివిధ క్రీడల్లో పాల్గొని వారిలో ఉత్సాహాన్ని నింపారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు విద్యార్థులు, ఉపాధ్యాయులు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు.

కార్యక్రమంలో డీవైఈవో శ్యాంసుందర్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఆదూరి ఆంజనేయులు, సహకార సంఘం మాజీ అధ్యక్షుడు నంబూరి శ్రీనివాసరావు, కోట నాగేశ్వరరావు, మెట్టగుట్ట శేషాచల శ్రీనివాస స్వామి ఆలయ కమిటీ చైర్మన్ పంది వెంకట్రావు, మహిళా నాయకురాలు గుండ్రెడ్డి వెంకటలక్ష్మి, బొలగాని కృష్ణ, కోరంపల్లి లక్ష్మణ్, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.